ఎన్నారైలూ! జన్మభూమి అభివృద్ధిలో భాగస్వాములు కండి: చంద్రబాబు పిలుపు
జన్మభూమి అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ప్రవాసాంధ్రులను కోరారు. తెలుగు ప్రజలను కొందరు భౌగోళికంగా విభజించారని, తాజాగా మరికొందరు మానసికంగానూ విభజించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరహా కుట్రలకు చెక్ పెట్టాలని ఆయన సూచించారు.